logo

అగ్ని వీరుడికి అశ్రునివాళి • అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

అగ్ని వీరుడికి అశ్రునివాళి
• అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
• వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం ప్రకటన
• సొంత నిధుల నుంచి మరో రూ. 25 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా, గోరంట్ల మండల, కళ్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్, పలువురు శాసన సభ్యులతో కలసి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయ్, శ్రీరాం నాయక్ నీ పరామర్శించారు. పుత్ర శోకంలో ఉన్న ఇరువురినీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం, ఐదు ఎకరాల పొలం, 300 గజాల స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతంగా మురళీనాయక్ కుటుంబానికి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదన్నారు.

4
622 views