సీనియార్టీ జాబితాపై స్పందించిన ఎస్టీ కమిషన్
ఆర్అండ్బీ ఇంజనీర్ల సీనియార్టీ జాబితాలో దళితులు, గిరిజన అధికారులకు అన్యాయం జరిగిందనే వార్తలపై ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా.డీవీజీ శంకర్రావు ఆదివారం స్పందించారు. పత్రికల్లో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించిందని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలపై ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. సీనియార్టి జాబితా రూపకల్పనలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటామని అన్నారు.