
‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ శుభాకాంక్షలు.
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ శుభాకాంక్షలు.
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో...సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా.
తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా.
తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా.
ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా.
రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా.
భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా... మన పసుపు జెండా!
దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం.
కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి...తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ...చారిత్రాత్మక దినమైన నేటి రోజున...ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను.
జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్!
#43YearsOfTDP
#TDPFoundationDay