
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు.
కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు కొత్తగూడెం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతికలు ఇఫ్తార్ విందులు, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంస్కృతి, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారని సమాజంలో అని ప్రతి ఒక్కరు వారి పొరుగువారి పండగలను కూడా గౌరవించాలని తెలియజేశారు అలాగే ఈ కఠోరమైన ఉపవాస దీక్షలు మనిషిలో నీతి, ధర్మం, ఆప్యాయత, అనురాగాలను పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా జీవిస్తూ, సమాజంలో నైతిక విలువలను పెంపొందించేలా జీవించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే సింగరేణి ముస్లిం ఉద్యోగులకు మరియు అధికారులకు ఈ సందర్భంగా రానున్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం తో పాటు ఎస్ ఓ టు జిఎం జి.వి. కోటిరెడ్డి, పద్మావతి గని ఏజెంట్ బి.రవీందర్, ఏరియా రక్షణాధికారి ఎం.వెంకటేశ్వర్లు, అధికారులు ఎస్.కె.కరిముల్లా, జాఫర్, షాకీర్ మొహినుద్దీన్, సలీం ఇతర అధికారులు పాల్గొన్నారు.