logo

లేక దూడల ద్వారా లాభాలు పొందవచ్చు డాక్టర్ సౌజన్య మీరు మా

లేక దూడల ద్వారా లాభాలు పొందవచ్చు
పాడి రైతులు శాస్త్రీయ పద్ధతిలో లేగదూడలను పెంచాలని డాక్టర్ సౌజన్య తెలియజేశారు. మంగళవారం బుచ్చంపేట లో పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శనలో ముందుగా గ్రామ సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేగ దూడలను శాస్త్రీయ పద్ధతిలో పెంచడం ద్వారా అధిక లాభాలు అర్జించవచ్చని అన్నారు. అలాగే పాడి రైతులు పశువుల పెంపకంలో పశు వైద్యాధికారులు, సిబ్బంది సలహాలు, సూచనల మేరకు పశువులకు, దూడలకు సమయానుకూలంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని, లేక దూడలకు నటల నివారణ మందులు తాగించాలని రైతులకు తెలియజేశారు.
దీనివల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పాడి రైతులు పెంచుతున్న లేగదూడలను పరిశీలించారు. లేగదూడల పెంపకం లో ప్రత్యేశ్రద్ధ తీసుకుంటున్న రైతులకు బహుమతులను అందజేశారు. ఈ లేగ దూడలు ప్రదర్శనలో 50 దూడలు పాల్గొన్నాయి. లేప తోటల ప్రదర్శనలో మొదటి బహుమతి పోతల వెంకటస్వామి, రెండవ బహుమతి బుదిరడ్ల చిన్నోడు, 3వ బహుమతి రెడ్డి రాజబాబు దక్కించుకున్నారు. కా మీరు మారర్యక్రమంలో రావికమతం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప, డాక్టర్ భాలతేజ, డాక్టర్ మౌనిక, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

0
1339 views