logo

కొనసాగుతున్న పోలీసు కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్



స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు
పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 7న తెలిపారు.
జనవరి 7న నిర్వహించిన 7వ రోజు పి.ఎం.టి. మరియ పి.ఈ.టి. పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులు
హాజరుకావాల్సి ఉండగా, 351 అభ్యర్థులు మాత్రమే పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారన్నారు. నియామకాల
ప్రక్రియ వేకువ జామున 5గంటల నుండే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పి.ఎం.టి. మరియు
పి.ఈ.టి. పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయన్నారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు
ఎస్పీ పి. సౌమ్యలత స్వయంగా పర్యవేక్షించారు.
అభ్యర్ధులకు ముందుగా హాల్ టిక్కెట్స్ ను పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం, అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధృవపత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్ధులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని, పి.ఎం.టి. పరీక్షలకు అనుమతించామన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఇక్విప్మెంట్స్ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులక పి.ఈ.టి. పరీక్షలను అనుమతించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ నియామక ప్రక్రియలో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు,
యూనివర్స్, ఎం.వీరకుమార్, ఎస్.బాపూజీ, టి.ఎన్.శ్రీనివాసరావు, కే.థామస్ రెడ్డి, ఎఓ పి. శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పిఈటిలు మరియు ఇతర పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొని, ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు.

0
0 views