జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామం కల్లూరు:
మండలం:- కుంటాల
మత్తుకు యువత-జీవితం చిత్తు
మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం-వ్యసనాలకు దూరంగాఉందాం.
కుంటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గౌరవ అతిథిగా విచ్చేసిన కుంటాల ఎస్ఐ భాస్కరాచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదవాలని, ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని దిశలో ప్రయాణించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని,తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని,సిగరెట్,గంజాయి,గుట్కా,తంబాకు,వైన్,కొకైన్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు."ఆరోగ్యమే మహాభాగ్యమని"విద్యార్థులు లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నరని కావున విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉన్నతమైన ఉత్తమమైన, జీవితాన్ని అనుభవించాలని, తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని తెలియజేశారు.అనంతరం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మణరావు పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు వింటూ శ్రద్ధగా చదువుకొని వారికి సమాజంలో మంచి పేరు తెచ్చిపెట్టే మంచి పిల్లలుగా పేరు తెచ్చుకోవాలని అన్నారు. ప్రజలలో అవగాహన రావాలని సదుద్దేశంతో విద్యార్థులచే గ్రామంలోని ప్రధాన కూడలిలలో భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి, జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మణరావు పటేల్ ను ఘనంగా అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.