logo

నంద్యాల జిల్లా (పాణ్యం): అమిత్ షా ను కేంద్ర హోం మంత్రి పదవి నుండి తొలగించాలి.

నంద్యాల జిల్లా (పాణ్యం) :-
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పై అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవినుండి బర్తరఫ్ చేయాలని నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి కె అరుణ్ కుమార్. సమాజవాది పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ లు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై వ్యంగంగా మాట్లాడటం భారత ప్రజలను అవమానించినటు అన్నారు.అణగారిన వర్గాలకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి, నేడు కోట్లజనాభా కు రాజ్యాంగ ఫలాలను అందించిన గొప్ప మహాయుడన్నారు
అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నంద్యాల జిల్లా అధ్యక్షులు వనం. వెంకటాద్రి. ఎస్ ఎఫ్ ఐ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్ రాజా, ఎన్ ఎస్ యు ఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన. ప్రతాప్ లు మాట్లాడుతూ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం ప్రత్యేకంగా పోరాటం చేసి హక్కులు సాధించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన అవమానించడం అత్యంత హేయమైన చర్యని వారన్నారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం పాణ్యం నియోజకవర్గం అధ్యక్షులు వనం. రాజు, ఎస్. ఎఫ్.ఐ మండల కార్యదర్శి ఎన్. సతీష్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్. నాగరాజు, రంగా, గిరి,చంద్ర గోవిందు, అక్బర్, మెహబూబ్ దగ్గర ఆటో కార్మికులు పాల్గొన్నారు.

8
452 views