నంద్యాల జిల్లా:
ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్లు.
నంద్యాల జిల్లా :
నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్ బిసి4 చైర్మన్గా ఏకగ్రీవంగా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మనోహర్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతులకు సకాలంలో నీటిని అందించి వారి అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు.