logo

ప్రకటన .............. *జనవరి లో సంగారెడ్డి లో జరిగే* *సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయండి*. *సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపు*


ఉద్యమాల దిక్సూచి ,పోరాటాల సారధి , కష్టజీవుల గొంతు సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు 2025 జనవరి 25-28 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో జరుగనున్నాయి . మహాసభలను జయప్రదం చేయాలనీ ఆదిలాబాద్ పార్టీ జిల్లా కమిటీ పిలిపు నిస్తుంది . ఈ సందర్బంగా స్థానిక సుందరయ్య భవనంలో మహాసభల ప్రచార కరపత్రాలు విడుదల చేశారు .పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ , నిరంకుశంగా పాలించిన బి.ఆర్ .ఎస్ . ను ఓడించి ఆరు గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రభుత్వం మారింది తప్పా ప్రజల సమస్యలు పరిస్కారం కావడం లేదు అన్నారు . ఒకటి రెండు గ్యారంటీలను అరకొరగా అమలు చేసి చేతులు ఎత్తేసే పని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నదని విమర్శించారు . కార్మికులు ,కాంట్రాక్టు ఉద్యోగులు ,రుణమాపీ కానీ రైతులు ఇలా క్రమంగా అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ పాలనా పట్ల వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు .

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబానీ ,అదానీల సర్కార్ గా మారిందని ఎద్ద్దేవ చేశారు . నిత్యవసర సరుకుల ధరలు ,పెట్రోల్ ,గ్యాస్ ధరలు సామాన్యునికి అందకుండా చేసి ,కార్పొరేట్లకు లాభాలు చేయడమే పనిగా పెట్టుకున్నది . ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి మతవిద్వేషాలు రెచ్చగొట్టి పాలించడం నేర్చుకున్నది అందులో బాగానే పార్లమెంట్ లో అమీద్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు అని మండి పడ్డారు .

ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలకు ఆర్థిక ,హార్దిక సహాకారం అందించి జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు , తొడసం భీంరావు , జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న,ఆర్.మంజుల,ఆర్.సురేందర్,నాయకులు కే .ఆశన్న , ప్రభు,ధోనిపెల్లి స్వామి,మోహన్,అశోక్ తదితరులు పాల్గొన్నారు .

0
558 views