logo

అమిత్ షా రాజీనామా చేయాలి.. • ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, ప్రతినిధి, కామారెడ్డి జిల్లా : అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్య లకు క్షమాపణలు చెప్పి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని వెంటనే అమిత్ షా భారత జాతికి క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం కొరకు అందరికీ రాజ్యాంగ ఫలాలు దక్కాలని ఉద్దేశంతోటి అన్ని వర్గాల క్షేమాన్ని కోరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే, రాజ్యాంగానికే తూట్లు పొడిచి దంతాన్ని అమలు చేయాలని లక్ష్యంతో పని చేస్తున్న బిజెపి అంబేద్కర్ ను విమర్శించటం అంటే భారత జాతిని విమర్శించటం కించపరచట మే అవుతుందని ఆయన అన్నారు.

1
3304 views