💥 టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే వరకు కూడా తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదు.
- శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.
ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ 👇
🔶 భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు. ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉంది.
🔶 ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోంది.
🔶 భూమి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే దాని కోసం ఎన్నో పంచాయితీలు జరుగుతాయి.
🔶 టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరకలేదు.
🔶 ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఎవరు నమ్మలేదు.
🔶 అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
🔶 హిందూ - ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారు.
🔶 కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ గారు పొట్టి కూటి కోసం వచ్చిన వాళ్లతో మాకు పంచాయితీ లేదన్నారు.
🔶 అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం అంటూ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు.
🔶 గతంలో బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు. కానీ గత 20 ఏళ్లుగా మాత్రం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారు.
🔶 అలాంటిది తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో భూముల ధరలు ఢమాల్ అంటాయంటూ అనుమానంతో వాళ్లు ఉండేవారు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు వాళ్లు భయపడ్డారు.
🔶 అదే విధంగా తెలంగాణలో భూములకు గతంలో నీళ్లు ఉండే పరిస్థితి లేదు.
🔶 మా తాతకు కూడా వందల ఎకరాలు ఉండేది. కానీ నీళ్లు లేకపోవటంతో దానికి ఎలాంటి విలువ లేకుండా పోయింది.
🔶 ఎంత పెద్ద భూస్వామి అయినప్పటికీ భూమికి విలువ లేకపోవటంతో బంగారం కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.
🔶 కేసీఆర్ గారు ఇవన్నీ దగ్గరుండి గమనించారు. నీళ్లు లేకపోవటంతోనే భూములకు విలువ లేదని గ్రహించారు.
🔶 కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన సరే ఎకరానికి రూ. 15 లక్షలు అయ్యింది.
🔶 భూమి విలువ పెరిగితే భూమి ఉన్న యజమానికి ఎంతో భరోసా ఉంటుంది.
🔶 రైతు భరోసా వచ్చి, సాగు నీళ్లు వచ్చి, 24 గంటల కరెంట్ వచ్చి ఇవ్వాళ ప్రతి రైతు ఎంతో భరోసాగా ఉన్నాడు. దానికి కారణం కేసీఆర్ గారే.
🔶 మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరి ఈ మార్పు ఎలా ఉంది?
🔶 తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ను మీరు నాశనం చేస్తారంట కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.
🔶 తెలంగాణ రాకముందు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ ఉండేవి.
🔶 రైతులు అర్థరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
🔶 కానీ కేసీఆర్ గారు మొత్తం పరిస్థితిని మార్చేశారు. నీళ్లు, కరెంట్ సమస్యను తీర్చేశారు.
🔶 తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే జరగలేదు.
🔶 సమగ్ర, సమీకృత అభివృద్ధిని కేసీఆర్ గారు చేశారు. అందుకే తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక్క ఎకరం రూ. 15 లక్షలు ఉంది.
🔶 మా ప్రత్యర్థులు మాత్రం డెవలప్మెంట్ ఆటో పైలట్ మోడ్ లో ఉందని అంటారు.
🔶 మరీ ఈ ఏడాది ఎందుకు డెవలప్ మెంట్ జరగటం లేదు. మంచిగా చేసిన కరెంట్ ను కూడా నాశనం చేశారు.
🔶 ఏ రైతును కదలించినా బాధపడుతున్నారు. మేము కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని చెబుతున్నారు.
🔶 నల్గొండలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో వాళ్ల పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను చెబుతున్నారు.
🔶 ఇప్పుడు బిల్డర్లు కనీసం పర్మిషన్లు కూడా తీసుకోవటం కష్టమైపోతోంది.
🔶 ఇటీవల ఒక పెద్ద బిల్డర్ వచ్చి మరో ఏడాదిలో పరిస్థితి మారకపోతే ఎంతో మంది చిన్న బిల్డర్లు చితికిపోతారని చెప్పారు.
🔶 శక్తికి మించిన పెట్టుబడులు పెట్టాం. కానీ మా భూములు అమ్ముడుపోవటం లేదని బాధపడ్డారు.
🔶 ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోంది.
🔶 రియల్ ఎస్టేట్ రంగం గురించి నా కన్నా ఎక్కువ ఎవరికి తెలుసని ముఖ్యమంత్రి అన్నాడు.
🔶 మంత్రి పదవి గురించి అడిగితే గుంపు మేస్త్రి మాదిరిగా పనిచేస్తా అన్నాడు.
🔶 మరి 11 నెలలు అయ్యింది. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు.
🔶 హైడ్రా అనే పేరుతో ఆలోచన లేకుండా చేస్తున్నారు. కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసం దాన్ని పెట్టారు.
🔶 ప్రాజెక్ట్ కు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడుతున్నారు. పర్మిషన్ కావాలంటే అది గాలిలో దీపం మాదిరిగా అయ్యింది.
🔶 ప్రాజెక్ట్ లు రద్దు చేస్తున్నాడు, కొత్త ప్రాజెక్టులు లేవు, బిల్డర్లను బెదిరించి డబ్బులు కావాలని అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పంపించాలి.
🔶 మార్కెట్ లో ఎవరి దగ్గరా డబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారు.
🔶 నేను చెప్పేవన్నీ నిజాలని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.
🔶 మా మీద కోపంతో వేల మంది కడుపులు కొట్టొద్దు. మంచి పనులు చేయండి.
🔶 రైతు బంధు వేస్తే మళ్లీ ఆ డబ్బు ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో వస్తుంది.
🔶 రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు.
🔶 కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని అన్నారు. కానీ ఇప్పుడు ముక్కు పిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు.
🔶 రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు తెలియాలి.
🔶 హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో నష్టం చేస్తుంది.
🔶 ఎఫ్టీఎల్ లాంటి ప్లేస్ లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వంలో ఒక చేయి ఏం చేస్తుందో.. మరో చేయికి తెలియదు.
🔶 అందుకే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
🔶 మేము మీకు సంబంధించి శాసన సభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.
🔶 హైడ్రా పేరుతో అనాలోచితంగా కూల్చివేయటంతో ఓ గర్భిణీ మహిళ 40 ఏళ్లు ఎలా ఈఎంఐ కట్టాలని ప్రశ్నించింది.
🔶 మరి దీనికి హైడ్రానా, మున్సిపల్ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెబుతారు.
🔶 రెరాతో మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ మరింత బలపడాలి.
🔶 మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలవటం ఖాయమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.
🔶 మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయలేదు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయాలని భావించాం.
🔶 ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకొని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తాం.
🔶 ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం.