logo

అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి -SFI విచారణ వేగవంతం చేయాలని కోరుతూ DRO గారికి ఎస్ఎఫ్ఐ వినతి




బీసీ చిన్నపిల్లల హాస్టల్లో అనుమానాస్పదంగా మరణించిన కొనతాల శ్యామలరావు మృతికి న్యాయం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విజయనగరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు J రవికుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మరణించిన విద్యార్థి మరణం సాధారణమైనది కాదని ఈ మరణం వెనక ఉన్న అన్ని కోణాలను ప్రభుత్వం వెతికి తీయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వారం రోజులు ముందు నుంచి విద్యార్థికి వార్డెన్ జానకిరామ్ గారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం రాత్రి కూడా వార్డెన్ విద్యార్థి అంతు చూస్తానని బెదిరించడం జరిగిందని విద్యార్థులు ఎస్ఎఫ్ఐకి తెలియజేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యార్థి స్పృహ కోల్పోతే 10 గంటల వరకు ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవడం దారుణమని , కక్షపూరితంగానే వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. హాస్టల్ పక్కనే ఉన్న ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా ఊరు అవతల ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం వెనక ఆంతర్యం ఏమిటి అని విమర్శించారు. గతంలో ఈ వార్డెన్ వేధింపులకే పూసపాటిరేగలో ఒక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇప్పుడు ఈ మరణం కూడా అటువంటిదే అని తెలిపారు. తక్షణమే ఇన్ని అనుమానాలు ఉన్న ఈ మరణం పై ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని అదే సందర్భంలో ఎంత నిర్లక్ష్యంగా, నిరంకుషత్వంగా ఉన్న వార్డెన్ జానకిరామ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దానితో పాటు విద్యార్థి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. ఆందోళన అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు డిఆర్ఓ శ్రీనివాసమూర్తి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే డిఆర్ఓ గారు కలెక్టర్ గారితో చర్చించి రెండు రోజుల లోపు ఈ మృతిపై విచారణ చేసి నివేదిక అందించాలని DBCWO గారికి ఆదేశించారు. జిల్లా యంత్రాంగం తమ హామీ మేర విచారణ వేగవంతం చేసి విద్యార్థి కి న్యాయం చేయాలని వార్డెన్ జానకిరామ్ గారిని సస్పెండ్ చేయాలని, అదే సందర్భంలో విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల నష్టపరిహారం అందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో హాస్టల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ సమీరా, R శిరీష జిల్లా కమిటీ సభ్యులు సోమేశ్ ,రాజు, సుస్మిత పట్టణ నాయకులు జయ ,ఆధ్యా ,శిరీష ,రాహుల్ తదితరులు పాల్గొన్నారు

7
403 views