నంద్యాల జిల్లా: హిందీ సాహిత్య కమిటీ "కార్వానె ఉర్దూ" ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్దూ సెమినార్ కు విశేష స్పందన..
నంద్యాల జిల్లా: ఉర్దూ సాహిత్య కమిటీ "కార్వానె ఉర్దూ" ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల లో ఉర్దూ సెమినార్ నిర్వహించారు. కార్వానె ఉర్దూ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన నిర్వహించిన ఉర్దూ సెమినార్ లో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ కరీముల్లాహ్ పాల్గొన్నారు." అల్లామ ఇక్బాల్ జీవిత చరిత్ర - వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలు" అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 20 మంది విద్యార్థిని, విద్యార్థులు వ్యాసాలు సమర్పించారు. సెమినార్ న్యాయ నిర్ణతలుగా అంజద్ షరీఫ్, సయ్యద్ జమీలుద్దీన్ వ్యవ్హరించారు. ఈ సమావేశంలో సమద్ మాట్లాడుతు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, కొత్త అంశాల అన్వేషణలో అంతర్జాతీయ ఉర్దూ కవి, ఉర్దూ సాహిత్య వేత్త అల్లమా ఇగ్బాల్ జీవితాన్ని తర్కిస్తు తమ వ్యాసాలు వినిపించారన్నారు. ఉర్దూ భాషా మాధుర్యాన్ని శ్రోతలు ఆస్వాదించారన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీముల్లాహ్ మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులల లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉర్దూ సాహిత్య కమిటీ కార్వానె ఉర్దూ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.. కార్వానె ఉర్దూ జిల్లా కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఉర్దూ సెమినార్ లో పాల్గొన్న విద్యార్థుల కు 9 నవంబర్ స్థానిక నేషనల్ పి.జి కళాశాలలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమోంటో, ప్రశంసా పత్రాలు అందచేయటం జరిగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం, పెద్దా సంఖ్య లో ఇంటర్ మీడియట్ ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు.