మంత్రి "నారా లోకేష్" దృష్టికి జర్నలిస్టు సమస్యలు
*🔥@- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నాయకులు..*
*అమరావతి, వార్తా ప్రపంచం:* జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ నాయకులు ఉండవల్లి లోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను కలసి వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు..
ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల లోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విరాజిల్లడానికి, పరుగెత్తే కాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతి దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలో కానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ని కోరినట్లు తెలియజేశారు.
జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని, జర్నలిస్టులకు సంక్షేమ రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలియచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దినేని మానస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ శ్రీధర్, గడ్డం నాగరాజు, గొల్లమందల జయరాజు ఉన్నారు..