logo

విజయనగరం పట్టణంలో ఘనంగా నాగులచవితి వేడుకలు



నాగులచవితిని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలో పుట్టల వద్దకు భక్తులు పోటెత్తారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుండే పుట్టల వద్ద హడావిడి మొదలైంది. అయితే 8 గంటల నుంచి 9 గంటల వరకు దుర్ముహూర్తం ఉండడంతో ఎక్కువ మంది 9 గంటల తర్వాతే పుట్టలో పాలు పోయడానికి మొగ్గు చూపారు. పిల్లలు బాణాసంచా కాలుస్తూ ఆనందం పంచుకున్నారు . అయితే ఇంటి నిర్మాణాలు పెరిగిపోవడంతో పుట్టలు వెదుక్కోవాల్సి వచ్చింది .

0
368 views