logo

నేడు పాలకొండలో పవన్ పర్యటన


జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో
పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన
రాజుపేట జంక్షన్ వద్ద హెలికాప్టర్ దిగి, అక్కడి నుంచి
తన కాన్వాయ్ లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ
సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ
జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం
విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

0
0 views