logo

మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని రాజం పట్టణం వీధులలో ప్రచారం చేస్తున్న డాక్టర్ రాజేష్ దంపతులు



*ఈసారి నీ భర్త గెలుపు తథ్యం అంటూ ఓ అవ్వ డాక్టర్ రాజేష్ సతీమణి చెవిలో చెబుతున్న దృశ్యం*

*రాజేష్ గెలుపు కోసం రాత్రి పగలు తేడా లేకుండా తన వంతు కృషి చేస్తున్న పాలవలస శ్రీనివాసరావు*

*పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ పువ్వులుజల్లి హారతులు ఇస్తున్న ప్రజలు*

*డాక్టర్ రాజేష్ కు చిన్న, పెద్ద తేడా లేకుండా ఘన స్వాగతం పలుకుతున్న పట్టణ ప్రజలు*



మే 13 వ తారీకున జరగబోయే ఎన్నికల లో ఫ్యాన్ గుర్తు కే ఓటు వేయాలని వైసీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకే మీ అమూల్యమైన ఓటు ముద్రను వేయాలని కోరుతూ అభ్యర్థి తలే రాజేష్, అతని సతీమణి కోరుతూ ప్రచారం చేశారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ వారి సతీమణి డాక్టర్ మాధవిలత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాజాం నగరంలోని బుక్కా, కస్పా, ఆసపు, సాయిబులు, ఠనా, కూరాకుల, చిక్కాల విధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విధుల్లో మహిళను ఓటు అభ్యర్థించగా 'గత టీడీపీ ప్రభుత్వంలో ఏదైనా పథకాలు లబ్ది పొందాలి అంటే కార్పొరేటర్లు, జన్మభూమి కమీటీ సభ్యులు, ఆ పార్టీ నాయకుల ఇళ్ళ చుట్టు తిరిగేవాళ్ళం.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద మనసుతో తీసుకువచ్చిన వాలంటీర్ లు మా ఇంటి వద్దకే వచ్చి మరీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. మాకు మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలి.. మా ఓటు ఫ్యాన్ గుర్తుకే సార్, మా దీవెనలు మీకే సారు!''''అంటూ పలు విధుల్లో మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్, వారి సతీమణి డాక్టర్ మాధవిలత లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టౌన్ పార్టీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, టౌన్ పరిధిలో పలువురు ప్రజాప్రతినిధులు, వైయస్సార్ సీపీ పార్టీ శ్రేణులు, స్థానికులు, వివిధ హెూదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు...

30
2005 views