logo

నేడే వైఎస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ నామినేషన్***మీకు ప్రజా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి: అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్

*అందరూ వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: అభ్యర్థి డాక్టర్ రాజేష్*

*ప్రజాసేవ నా జీవిత ఆశయం*

*మీ అందరి దీవెనలతో రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిద్దాం నాకు మద్దతు ఇవ్వండి*

విజయనగరం జిల్లా.రాజాం.

రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ డాక్టర్ తలె రాజేష్ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసే విషయంపై ఎలక్షన్ కమిషన్ కు పార్టీ యొక్క బీ- ఫామ్ సమర్పించవలసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాజ్యసభ సభ్యులు,రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి యొక్క చేతులు మీదుగా బీ- ఫామ్ అందుకోవడం జరిగింది. నేడు 24వ తారీఖున నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము కావున. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుండి ర్యాలీగా మెయిన్ రోడ్డు నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు వెళ్ళబడును. కావున ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి నన్ను ఆశీర్వదించి మీ ఆశీస్సులు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ తెలియజేశారు....

50
2446 views