logo

అందరూ జంప్ జిలానీలే..!


(సురేష్..జర్నలిస్ట్..9948546286)_*
విజయనగరం
వర్తమాన రాజకీయాల్లో విజయనగరం జిల్లాలోని పెద్ద నాయకుల్లో ఏదో ఒక సందర్భంలో పార్టీలు మారని వారు ఎవరైనా ఉన్నారా..
ఎంత ఆలోచించినా గాని
ఒక్క పేరైనా తట్టడం లేదే..
ఉన్న పార్టీలో పదవి రాలేదనో..వేరే పార్టీ వోళ్ళు ఇస్తామని ఆశ పెట్టడం వల్లనో ..నమ్మిన..నమ్ముకున్న పార్టీపై అలిగి రెబల్..లేదా స్వతంత్రులుగా బరిలోకి దిగడమో..మొత్తానికి ఎలా అయినా గాని..ఏ నాయకుడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..రాజకీయ జాతి
సమస్తం జంపింగ్ జిలానీలే..
ముందుగా అశోక్ గజపతిరాజుతోనే మొదలెడదాం..పివిజి రాజు గారబ్బాయి ముందుగా 1978లో జనతా పార్టీ కండువాతో అరంగేట్రం చేశారు.ఆయన పదవీ ప్రస్థానం జనతా ఎమ్మెల్యేగానే మొదలైంది.
తర్వాత ఆయన లోక్ దల్లోకి గెంతారు.1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నీడలో కొనసాగుతున్నారు.
ఇక బొత్స సత్తిబాబు మొదలుకుని..
ఆయన సతీమణి ఝాన్సీ..
తమ్ముడు అప్పలనర్శయ్య..
బడ్డుకొండ..చిన్న శీను..
బెల్లాన ఇత్యాదులు
కాంగ్రెస్ ను విడిచి
ఒక్కసారిగానో.. ఒకరొకరుగానో వైసీపిలోకి
జంప్ అయిపోయిన వాళ్ళే.
కాగా సత్తిబాబు ఎంపిగా ఉన్నప్పుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారని..మొన్నా మధ్య బిజెపిలో చేరేందుకు సైతం ఆ పార్టీ పెద్ద నాయకులతో మంతనాలు జరిపారని వార్తలు ఉన్నాయి.అయితే ఆయా కాలమాన పరిస్థితుల దృష్ట్యా అవి కార్యరూపం దాల్చలేదు
కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్..వైసిపితో పాటు
2004 లో "టోపీ" పెట్టుకుని
స్వతంత్ర అభ్యర్థిగా విజయనగరం నుంచి పోటీ చేశారు.అన్నట్టు ఇదే స్వామి 2005 మునిసిపల్ ఎనికల్లో
బీఎస్పీని కూడా ఆశ్రయించి ఏనుగు ఎక్కినంత పని చేశారు.
ఇక బొబ్బిలి రాజ సోదరులు
కాంగ్రెస్..వైసీపీలో చక్కర్ కొట్టి ఇప్పటికి సైకిల్ ఎక్కి ఉన్నారు.

వారి ప్రత్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు మరో రెండాకులు ఎక్కువే చదివి
తెలుగుదేశం..కాంగ్రెస్..బిజెపి
అన్నీ చుట్టబెట్టేసి అన్ని చోట్ల చాపచుట్టేసి ప్రస్తుతానికి
ఫ్యాన్ గాలిలో సేద దీరుతున్నారు.
ఇప్పుడు..మీసాల గీత విషయానికి వద్దాం..
ఆమె హస్తం చలవతో
విజయనగరం మునిసిపల్
చైర్ పర్సన్ అయ్యారు.
తర్వాత ప్రజారాజ్యం పంచన చేరి 2009 ఎన్నికల్లో చెయ్యి కాల్చుకున్నారు.పిదప సైకిలెక్కి 2014 ఎన్నికల్లో
విజయనగరం ఎమ్మెల్యే అయ్యారు.2019 లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అయిదేళ్ల పాటు ఉగ్గబట్టుకుని కూర్చున్నా మళ్లీ 2024 లో కూడా సైకిల్ పార్టీ దెబ్బ కొట్టేసరికి అదే సైకిల్ ని కిల్ చెయ్యాలన్న లక్ష్యంతో
ఇండిపెండెంట్ గా విజయనగరంలో బరిలోకి దిగుతున్నారు..!
కడుబండి శ్రీనివాసరావు..
నిజానికి ఈయనకి రాజకీయాలు తెలిసిందే తక్కువ.వలస పక్షి..ముందు ప్రజారాజ్యం..ఆ పార్టీ అభ్యర్థిగా గజపతినగరంలో
పరాజయం.అనంతరం వైసిపి ప్రవేశం..ఈయన అధికారంలోకి రఘురాజు
అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం..ఈయనకి ఆవేశం..
పార్టీ వదిలిపోదామని
అనుకున్నా ప్రాయోపవేశం
అయిపోతుందనే బెంగతో
కృంగిపోతూ వైసిపిలోనే ఉన్నందుకు జగనన్న మళ్లీ టికెట్ బహుమతి ఇచ్చారు.
ఇదండీ..ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న మన జిల్లా జంప్ జిలానీల్లో కొందరి కథ.
ఇంకా ఇంకా ముందుకు వెళ్తే
పివిజిరాజు మొదలుకుని..
సాంబశివరాజు..ఆనందగజపతి రాజు..వాసిరెడ్డి..
శత్రుచర్ల.. వైరిచర్ల నుంచి నేటి గురాన అయ్యలు..
అవనాపు వారు..పిళ్ళా
ప్రసాదుల..కాళ్ల..అందరూ జంప్ జిలానీలే..
కొందరైతే రాజకీయంగా ఇంకొందరి చేతుల్లో బఠానీలే..రాజకీయాల్లో మొత్తం గూడుపుఠాణీలే..!

91
4207 views