logo

ఓటుకు డబ్బులు తీసుకోవద్దని ప్రజలను చైతన్యం చేస్తున్న జైభారత్ నేతలు

జైభారత్ నెల్లూరు జిల్లా అడ్వైజర్ నేతగాని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం రావూరు పంచాయతీ సుజాత నగర్ యువత చేతుల మీదుగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జైభారత్ జాతీయ సమితి సభ్యుడు ఖదిజ్ఞాసి కార్తికేయ మాట్లాడుతూ ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటును డబ్బులకు అమ్ముకోకుండా నిజాయతీగా ఓటు వేసి, మంచి నాయకుడను ఎన్నుకోవాలన్నారు. 500, 1000 రూపాయలకు ఓటును అమ్ముకుని 5 ఏళ్ల జీవితాన్ని ధనవంతులకు తాకట్టు పెట్టొద్దని కోరారు. అనంతరం జైభారత్ సామాజిక విప్లవ రణభేరి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రొండ్ల ప్రభుదాస్, జైహో జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్లముక్కల వంశీకృష్ణ, అడ్వకేట్ వినయ కుమార్, పిట్టీ సురేష్ లు కలిసి సుజాత నగర్, రావూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఉద్యమం గురించి అవగాహన కల్పిస్తూ జైభారత్ జస్ట్ ఓట్ కర పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైహో నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈదూరు జ్ఞానప్రసాద్, జైభారత్ బీసీ పోరాట వేదిక ఇందుకూరుపేట మండలం అధ్యక్షుడు పనబాక మస్తాన్ లు వున్నారు.

17
4444 views