logo

ఏసు త్యాగానికి ప్రతికగా నిలిచిన రోజు గుడ్ ఫ్రైడే సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానం శాంతి ప్రేమ కరుణ యేసు చూపిన మార్గం

కొత్తగూడెం మార్చ్ 30 ( ): రుద్రంపూర్ పేతురు దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా సి ఎస్ ఐ సంఘ కాపరి ఫాస్ట్ రేట్ చైర్మన్ ఏసుబాబు సెక్రటరీ రవి రత్నరాజు ట్రెజరర్ మేరీ కుప్ప స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడంజరిగింది.. ముందుగా 12 గంటల నుండి మూడు గంటల సమయం వరకు యేసు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించడం జరిగింది. పలువురు ప్రత్యేక గీతాలు ఏసుప్రభును మరిస్తూ పాటలు పాడడం జరిగింది. మొదటి మాటగా తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు లూకా 23:34 బైబిల్ ప్రకారము వాక్యం ధ్యానం ఫాస్ట్ రేట్ చైర్మన్ ఏసుబాబు అందించడం జరిగింది. తదుపరి రెండవ మాటగా మార్తా ఏసుబాబు అమ్మగారు నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు.లూకా 23:43 వాక్యం ద్వారా అందించడం జరిగింది. మూడవ మాటగా అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను.యోహాను 19:26,27 ఈ వాక్యాన్ని ఫాస్ట్ రేట్ చైర్మన్ ఏసుబాబు వివరించడం జరిగింది . తదుపరి నాల్గవ మాటగా ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి మత్తయి 27:46 వాక్యం ద్వారా మార్త ఏసుబాబు తల్లిగారు వివరించడం జరిగింది . ఐదవ మాటగా ఫాస్ట్ రేట్ చైర్మన్ ఎస్ బాబు లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొను చున్నాననెను.యోహాను 19:28 అను వాక్యాన్ని ధ్యానించడం జరిగింది . ఆరవ మాటగా మార్త ఏసుబాబు తల్లి గారు యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది..యోహాను 19:30 వాక్యాన్ని అందించడం జరిగింది ఏడవ మాటగా ఫాస్ట్ రేట్ చైర్మన్ ఏసుబాబు తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాననెను. (లూకా 23:46) అని వాక్యాన్ని వివరించడం జరిగింది. సరిగ్గా మూడు గంటల సమయంలో ఏసుప్రభును సిలువలో వేలాడదీసే సమయం వారి వయస్సు ధ్యానిస్తూ 33 గంటలు మ్రోగించిన ఆనంద్.. తదుపరి చివర ప్రార్థన సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలోమ్ రాజ్ ప్రార్థనతో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. గుడ్ ఫ్రైడే వేడుకలకు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టతో 40 రోజులు ఉపవాసాలు ఉంటూ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ను ఎంతో పవిత్రంగా ఆచరిస్తూ సిలువలో మా పాపాల కొరకై కల్వరి గిరిలో ఎన్నో శ్రమలోందిన ఏసుక్రీస్తుని స్మరిస్తూ ప్రతి ఒక్కరూ కన్నీటితో ప్రార్థిస్తూ పాపముల కొరకై కలవరి గిరిలో ఏసుక్రీస్తును ధ్యానిస్తూ మరల మేము ఎటువంటి పాపంలో పడకుండా మమ్ములను మా కుటుంబాలని మీ ఆధీనంలో ఉంచుకోవాలని ఆ ఏసుక్రీస్తు ని వేడుకున్న భక్తులు.

0
866 views