logo

6వ తేదీన శ్రీసీతారాముల కల్యాణం


విజయనగరంఐదు 
నగరంలోని రింగ్ రోడ్డులో ఉన్న శ్రీ కల్యాణ
వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 6వ తేదీన
శ్రీ సీతారాముల వారి కల్యాణం అత్యంత వైభవంగా
నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 4న విష్వక్సేన
పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
5వ తేదీన అభిషేకం, 6వ తేదీన విశేష హోమాలు,
పూర్ణాహుతి, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు
ఉంటాయన్నారు. అదే రోజు కల్యాణం జరిపిస్తామని
చెప్పారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

4
2524 views