logo

రైలు ఢీకొని మహిళ మృతి


సీతానగరం మండలంలోని చినబోగిలి, కాశీపేట గ్రామాల
మధ్య రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన
ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల
వివరాల మేరకు.. చినబోగిలి నుంచి కాశీపేట వైపు నడిచి
వెళ్తున్న మహిళ పట్టాలను దాటేందుకు యత్నించింది.
అదే సమయంలో విజయనగరం వైపు నుంచి వస్తున్న
గూడ్స్ రైలు ఢీకొంది. మృతురాలికి 35 ఏళ్లు
ఉంటాయని, గులాబీ రంగు చుడిదార్, నలుపు రంగు
ప్యాంటు ధరించినట్లు చెప్పారు.

0
0 views