logo

*హీరో మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం* హీరోలు, అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అన్న

*హీరో మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం*

హీరోలు, అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు
మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి.

అన్నవిష్ణు.. ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువుల్ని
ఇలా కొడుతుంటాడని, ఇది సిచ్యుయేషన్ అంటూ
మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.


వీడియోలో విష్ణు ఎవరిపైకో దూసుకెళ్తుండగా ఇద్దరు
వ్యక్తులు ఆయనను అదుపు చేస్తున్నట్లు ఉంది.

కాగామనోజ్ పెళ్లి సమయం నుంచి అన్నదమ్ముల మధ్య
విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.

*అన్న విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మంచు మనోజ్ ?*

*మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవ టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.*


మనోజ్ దగ్గర పనిచేస్తున్న
సారథి అనే వ్యక్తిని కొట్టడానికి విష్ణు అతడి ఇంటికి
వెళ్లినట్లు తెలుస్తోంది.


అదే సమయంలో మనోజ్
అక్కడే ఉండటంతో ఆయనే విష్ణు వీడియో తీసినట్లు
సమాచారం.


కాగా తన వాళ్లను కొట్టడానికి వచ్చిన విష్ణుపై మనోజ్ కాసేపట్లో పోలీసులకు ఫిర్యాదు
చేయనున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

1
1064 views