|
|
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని ఘనంగా సన్మానించిన నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని ఘనంగా సన్మానించిన నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు
నంద్యాల జిల్లా : 🇮🇳 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న ఇమాములు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.45 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి లబ్ది చేకూరుతుంది,5,000 మంది ఇమాములు, 5,000 మంది మౌజన్లు గత ఆరు నెలల గౌరవ వేతనాన్ని అందుకోనున్నారు.ఈ నిధుల మంజూరులో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నశ్యం మహ్మద్ ఫరూక్ ని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం, ఇస్లామిక్ విద్యావేత్తలు, మత పెద్దలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇమాముల సంఘం అధ్యక్షులు హాఫిజ్ అంజద్ భాషా సిద్ధికి మాట్లాడుతూ "చంద్రన్న ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, ముస్లిం మతగురువుల గౌరవ వేతనాల కోసం రూ.45 కోట్లు విడుదల చేయడం మైనారిటీల సంక్షేమానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. 🇮🇳ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనారిటీల సంక్షేమాన్ని ప్రాముఖ్యతనిస్తూ మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న అని అన్నారు.అదే విధంగా ముస్లింలు సహా అన్ని వర్గాల అభివృద్ధికి మీ పాలన అంకితభావంతో కొనసాగాలని, మైనారిటీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయ్యలని ఆశిస్తున్నామని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి ఘనంగా సన్మానించి ముస్లింల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నశ్యం మహ్మద్ ఫరూక్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. 🇮🇳ఈ కార్యక్రమంలో నంద్యాల & కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్,తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం కార్యవర్గ నాయకులు, ఇస్లామిక్ విద్యావేత్తలు ఇమాముల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read More
|
|
|