logo

శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల.

వరంగల్-ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్నారు. శనివారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో ఏ ఆర్ వో లు, నోడల్ ఆఫీసర్లు మరియు తాసిల్దార్లతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న, కౌంటింగ్ జూన్ 5న ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కు పోలింగ్ సిబ్బంది నియామకం చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 55 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె తెలిపారు . 76 మంది పివోలు, 76 మంది ఏపీవోలు, 160 మంది ఓపిఓ లు అవసరం ఉన్నట్లు, ఈ దిశగా సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ విధులకు సిబ్బందిని నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ కు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నందున ఏ దశలోనూ తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 40,106 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదుకాగా, ఇందులో 22,590 మంది పురుషులు, 17516 మంది మహిళలు ఉన్నారన్నారు. 5 ఫ్లయింగ్ స్క్వాడ్, 5ఎంసిసి బృందాలు ఏర్పాటుచేసి, నిఘా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సెక్టార్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవోలు, తహశీల్దార్లు సందర్శన చేసి, వసతుల కల్పన చూడాలన్నారు. బ్యాలెట్ పత్రాల తనిఖీ బృందం పోలీస్ గార్డ్ తో వెళ్లి తీసుకొని రావాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఎంతో ముఖ్యమని, ఓటరుకు తమ ఓటుహక్కు ఎక్కడ ఉందో తెలియాలని, కావున 100 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉంటుందని, రిసిప్షన్ కేంద్రం నల్గొండలో వుండనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రూట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేసి, రవాణా ప్రణాళికా చేయాలన్నారు. బందోబస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

అనంతరం ఆర్డీవోలు, తాసిల్దార్లతో పెండింగ్ లో ఉన్న ధరణి, మీసేవ, ప్రజావాణి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో దరఖాస్తులు అన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంలో విద్యార్థులు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కుల, ఆదాయ తదితర దరఖాస్తులు అన్ని సత్వరమే పరిష్కరించాలని విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులన్నిటిని పరిష్కారానికి సత్వరమైన చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తిరిగి ప్రారంభించడానికి ముందే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన మరమ్మత్తుల పనులన్నీ పూర్తి కావాలనిఅధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్ రావు, ఎన్నికల సూపర్డెంట్ దార ప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ రంగప్రసాద్, నోడల్ ఆఫీసర్లు, తాసిల్దారులు, మరియు ఎంపీడీవోలు సంబంధిత అధికారులు తదితరు పాల్గొన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి, భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయంచే జారిచేయనైనది.

0
0 views