logo

పోలింగ్ సరళి పై సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్



విజయనగరం జిల్లా. రాజాం.

విజయనగరం ఎంపి అభ్యర్ధిగా వైకాపా తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎంపి బెల్లాన చంద్రశేఖర్ గురువారం రాజాం వచ్చారు. పార్టీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు నివాసానికి ఆయన చేరుకున్నారు. ఆయనను కలుసుకునేందుకు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లోని వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాజాం టౌన్ లోని వార్డుల వారీగా పోలైన ఓట్లు గురించి బెల్లాన చంద్రశేఖర్ వారితో చర్చించారు. సమావేశానికి పార్టీ నాయకులు దుప్పలపూడి నాగేశ్వరరావు, కాలెపు చంద్రశేఖర్, సలాది తులసీదాసు మాస్టర్, ఓలేటి గణపతి, తోట తిరుమలరావు, అశపు సూర్యం, దూబ గోపాలరావు, సలాది సతీష్, ముద్దన సత్యారావు, చప్పటి పెంటయ్య, ఎందవ అప్పన్న, వివిధ వార్డుల నాయకులు హాజరయ్యారు...

7
2299 views