logo

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వండాఢీ వెంకటేశ్వర్లు పై దాడి ని ఖండించిన ఎమ్మెల్యే

*మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య...*

*ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

మార్కెట్ కమిటీ చైర్మన్,ప్రముఖ బిసి నాయకుడు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తరువాత కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా దాడులు మంచి పరిణామం కాదన్నారు. బిసి నాయకుడు వండాడి వెంకటేశ్వర్లును పోలింగ్ రోజునే అసభ్యపద జాలంతో దూషించడం చాలా బాధాకరమన్నారు. తరువాత కొంతమంది చిల్లర గ్యాంగులు ను పంపించి వారి ఇంట్లో కార్లు,ఫర్నీచర్ ద్వంసం చేయడం పిరికిపంద చర్య అని అన్నారు.
ప్రస్తుతంరాయచోటిప్రాంతంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేవిధంగా, పాత రోజులుకు తీసుకెళ్లే విధంగా కొన్ని అల్లరి గ్యాంగులు తయారవు చున్నాయన్నారు. ఆలాగే పట్టణంలో మైనారిటీలకు చెందిన మొనార్క్ ఫర్నీచర్ షాప్ ను ద్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు.చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని, చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పిన తరువాత అందరినీ సంయమనం పాటించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారని, ఇందులో ఎవరి పాత్ర వున్నా వదలకుండా గట్టి చర్యలు తీసుకుని , ప్రస్తుతం రాయచోటిలోఉన్న ప్రశాంతవాతావరణాన్ని కొనసాగించేలా పోలీసులు నడుం బిగించారన్నారు. ఇటువంటి చర్యలుకు భవిష్యత్ లో పాల్పడితేమాలో కూడా ఓర్పు ,సహనం సన్నగిల్లి గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

0
517 views