నవంబర్ 9 న హెడ్ ఆఫీస్ వద్ద ధర్నా ను జయప్రదం చేయండి
కాంట్రాక్టు కార్మికుల కు ఇఎస్ఐ కార్డులు వెంటనే ఇవ్వాలి.
కాంట్రాక్టు కార్మికుల కి ఇ ఎస్ ఐ కార్డులు , ప్రతీ నెలా ఏడో తేదీ లోప్ జీతాలు చెల్లించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక కాంట్రాక్టు కార్మికుల పని ప్రాంతాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వీరన్న, ఎస్సీకెఎస్ సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాలు పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కడుపులు నింపాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ,జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యల విషయంలో తక్షణమే స్పందించే స్పందించాలని అన్నారు. సింగరేణి యాజమాన్యం ఇఎస్ఐ కార్డులు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు కార్మికులను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. డిల్లీలో జరిగిన జేబీసీసీఐ సమావేశంలో నిర్ణయం చేసి సింగరేణి యాజమాన్యానికి చెప్పినప్పటికీ నేటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ముందుగా కాంట్రాక్టర్లకు ఇ ఎస్ ఐ కార్డులు ఇవ్వాలంటే ఆరు నెలల కంట్రిబూషన్ ఇవ్వాలని నిర్ణయం చేసినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఎందుకు ఇవ్వడం లేదని అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అట్టి సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 9న హెడ్ ఆఫీస్ వద్ద ధర్నా ను చేపట్టడం జరిగిందనీ, కాంట్రాక్టు కార్మికులు అందరూ తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. అదే రోజు సంతకాలతో కూడిన పత్రాన్ని అందజేయాలని , కాంట్రాక్టు కార్మికుల వద్ద నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, శ్యామ్, ,సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సి కే ఎస్ ) నాయకులు భాస్కర్, గుగులోథ్ సక్రాం, కిషన్, ప్రభాకర్, లెనిన్, రమేష్, సంజీవ్, నాగరాజు, సంపత్ ,అఫ్జల్, గిరి తదితరులు పాల్గొన్నారు