logo

కృష్ణాజిల్లా / మచిలీపట్నం ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన జరగాలి - వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ డిమాండ్ చేస్తుంది - వైఎస్ షర్మిలా రెడ్డి


బాబు,జగన్ ఇద్దరు కుల గణన జరుపుతాం అని హామీ ఇచ్చారు

కుల గణన జరిపి బీసీలకు న్యాయం చేయండి - వైఎస్ షర్మిలా రెడ్డి


వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

- మన మోడీ ఒక బీసీ
- బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే
- ఆయన బీసీ అయ్యి ఉండి..ఆయన మాత్రమే గర్వంగా ఉన్నాడు
- బీసీలు మాత్రం గర్వంగా లేరు
- "బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ"
- 2017 లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు
- మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారు
- కుల గణన కు బీజేపీ వ్యతిరేకం అన్నారు
- బీజేపీ కి బీసీ ల పట్ల ప్రేమ లేదు
- బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు
- బీజేపీ అగ్రకుల పార్టీ
- అదానీ,అంబానీ లకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ
- బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు
- రాష్ట్రంలో కూడా చంద్రబాబు కి ప్రేమ లేదు
- బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్
- వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143 కి పెంచారు
- బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు
- ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానం లో నిలబెట్టారు
- స్కాలర్ షిప్ లు వైఎస్ఆర్ ఇచ్చారు
- బీసీలు వైఎస్ఆర్ ను ఓన్ చేసుకున్నారు
- ఆ రోజుల్లో నాకు గుర్తు ఉంది
- బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య అల్టిమేటం ఇచ్చారు
- బీసీల హక్కుల కోసం ఆమరణ దీక్షకు పిలుపు నిచ్చాడు
- బీసీల మీద గౌరవం తో ఆర్. కృష్ణయ్య ఒక్క నిమిషం కూడా దీక్ష చేయించలేదు
- దీక్ష చేస్తే బీసీలను అగౌరవ పరిచి నట్లు అనుకున్నాడు
- కృష్ణయ్య పెట్టిన 17 డిమాండ్ లు ఒప్పుకున్నాడు
- అసెంబ్లీ లో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు
- వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే .. చంద్రబాబు బీసీల ద్రోహి
- 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నాడు
- టీడీపీ బీసీ ల పార్టీ అన్నాడు
- 40 ఏళ్ల నుంచి టీడీపీ నీ మోసేది టీడీపీ అన్నాడు
- బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నాడు
- బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అన్నాడు...మోసం చేశాడు
- బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు
- పరిశ్రమలకు ప్రోత్సాహం అన్నాడు
- బీసీల అభివృద్ధి కి ఒక్క రూపాయి ఇవ్వలేదు
- ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు
- వచ్చిన 5 ఏళ్లలో విద్యుత్ బిల్లులను 17 వేల కోట్లు జనాలపై మోపారు
- ఇప్పటికే ఇల్లు గడవని స్థాయిలో చాలా కుటుంబాలు ఉన్నాయి
- ఇప్పుడు 40 శాతం అదనంగా పడుతున్న బిల్లులు భారమే కదా
- బీజేపీ సైతం రాష్ట్రానికి ఇచ్చేది గుండు సున్నా
- ఇచ్చిన హామీలు అన్ని పక్కన పెట్టారు
- హోదా లేదు... నిధులు లేవు
- కనీసం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడకుండా నిధులు కూడా ఇవ్వలేదు
- అయినా చంద్రబాబు పొత్తు పెట్టు కోవడం దారుణం
- బీజేపీ కి గత 10 ఏళ్లుగా బాబు,జగన్ లు ఊడిగం చేస్తున్నారు
- జగన్ సైతం బీసీలను మోసం చేశాడు
- నా బీసీలు అని మోసం చేశాడు
- ప్రతి ఏడాది 15 వేల కోట్లు ఇస్తా అన్నాడు
- 5 ఏళ్లలో 75 వేల కోట్లు ఇస్తా అన్నాడు
- ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
- 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు 75 వేలు ఇస్తా అన్నాడు
- ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
- కార్పొరేషన్ లు ఇచ్చాడు... ఇచ్చి రూపాయి కూడా ఇవ్వలేదు

- బీసీల అభివృద్ధి కి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ
- కాంగ్రెస్ కుల గణన అడుగుతుంది
- బీసీలకు న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాలి
- ఎంత మంది బీసీలు ఉన్నారు తేలాలి
- రిజర్వేషన్లు 50 శాతం కాదు .. ఎక్కువే కావాలి
- కుల గణన చేస్తే న్యాయం జరుగుతుంది
- కులాల వారిగా సంపదను పంచాలి
- తెలంగాణ లో ఇప్పటికే కుల గణన జరుగుతుంది
- ఆంధ్రలో కూడా కుల గణన జరిపించండి
- చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం
- బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుల గణన కావాలని అడిగారు
- జగన్ సైతం కుల గణన చేస్తా అన్నాడు
- కుల గణన జరిగితేనే ఎవరు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది
- కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
- వెంటనే ఆంధ్రలో కుల గణన జరపండి
- కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది..
- బీసీల పక్షాన నిలబడతం
- ఈ దేశంలో అత్యధికంగా ఉన్న వాళ్ళు బీసీలే

0
0 views