logo

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం*గరంగరంగ సాగుతున్న ఏపీ ఎన్నికలు



సర్వజనుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు
గ్రామాల అభివృద్ధి కూటమి యొక్క లక్ష్యం..
ఘన స్వాగతం పలికిన పాకాలపాడు గ్రామ కార్యకర్తలు ప్రజలు నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వెయ్యాలని సాగిన ప్రచారం
★ ★ సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు
🔸 పాకాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి # కన్నా లక్ష్మీనారాయణ గారు
★★ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా గారు అభ్యర్థించారు*

★★ ఈ సందర్భంగా కన్నా గారు మాట్లాడుతూ.....మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు*
★★రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చేరిగిన మాజీ మంత్రి # కన్నా... ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.సైకో పాలనను తరిమికొట్టి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు.ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయంలో కరెంటు చార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగాయి. రేపు మన ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా ధరలు తగ్గిస్తాం. . సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటే ప్రజలు మీ పాలనపై ఎందుకు విసుగు చెందుతారు. ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని ఆంధ్రప్రదేశ్,సత్తెనపల్లి ప్రజలు ఎదురుచూస్తున్నారు. సాండ్, ల్యాండ్, మైన్,వైన్, మాఫియాలు తప్ప ఐదేళ్ల జగన్ పాలనలో బాగుపడింది ఎవరు? అందుకే జనంలో తిరుగుబాటు మొదలైంది జగన్ పాలన నుండి విముక్తి ఎప్పుడెప్పుడా అని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రజలు అండగా రాష్ట్రాన్ని కాపాడేందుకు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిద్దాం.. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు
★ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు..

11
9085 views