logo

27న రామనారాయణంలో కార్తీక దీపోత్సవం


విజయనగరం: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం
రామనారాయణంలో ఈ నెల 27న సాయంత్రం
5:30కి రామ ధనుస్సు ఆకారంలో కార్తీక దీపోత్సవం
నిర్వహిస్తున్నామని ఎన్‌సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం
శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్మయ
మిషన్‌కు చెందిన స్వామి విజయానంద సరస్వతి
నేతృత్వంలో జరిగే దిపోత్సవంలో భక్తులు పాల్గొని దైవ
అనుగ్రహం పొందాలన్నారు.

0
16598 views