logo

పోలీసు శాఖలో ప్రతిభావంతులకు సేవా పథకాలు *75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో*

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రతిభావంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను ఉగాది 2020- 21 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన పేర్లు. 1, కె రమేష్ ఏ ఆర్ హెచ్ సి ఉత్తమ సేవ పథకం. 2, కె ఏసురత్నం ఏ ఆర్ హెచ్ సి ఉత్తమ సేవా పథకం. 3,యు నర్సింగరావు ఆర్ ఎస్ ఏ కఠిన సేవా పథకం. 4, కె రమేష్ ఆర్ ఎస్ ఏ కఠిన సేవా పథకం. అదేవిధంగా ఉగాది 2021 కి గాను. 5, ఎం డి ప్రసాద్ రావు ఆర్ ఎస్ ఎస్ ఏ మహోన్నత సేవ పథకం. 6, పి నాగేశ్వరరావు ఆర్ ఏ ఎస్ టి ఎఫ్ ఉత్తమ సేవా పథకం. 7, యమ్ పైడిరాజు పి సి కంట్రోల్ రూమ్ ఉత్తమ సేవా పథకం. అను వారికి రాష్ట్ర ప్రభుత్వం. అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పథకాలకు, ఉత్తమ సేవా పథకాలు, మహోన్నత సేవ పథకాలు, కఠిన సేవా పథకాల కు ఎంపిక చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేతులమీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 75 వ, స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో ప్రధానం చేశారు. పోలీసు శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు అభినందించి భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి లు, సిఐలు, ఆర్ ఐ లు, ఎస్సైలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

2
14678 views