logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన ఇద్దరు కొడుకులను చంపిన తల్లికి జీవిత ఖైదు

✨అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన ఇద్దరు కొడుకులను చంపిన తల్లికి జీవిత ఖైదు

జర్నలిస్టు మాకోటి మహేష్
✨వివాహేతర సంబంధంతో ఇద్దరు కొడుకులను చంపిన తల్లికి కోర్టు జీవిత ఖైదు విధించింది. రామకుప్పం మండలానికి చెందిన వేమారెడ్డికి పవిత్రతో వివాహం జరిగింది. వేమారెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వేమన్నతో ఆమెకు సంబంధం ఏర్పడింది. 2017 సెప్టెంబరులో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని 6, 3 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులను ఉరివేసి చంపింది. దర్యాప్తు ముగియడంతో చిత్తూరు కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.

*చిత్తూరు జిల్లా పోలీసు*
ఆమె అక్రమ సంబందానికి అడ్డు ఉన్నారనే నెపంతో తన 6 మరియు 3 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కొడుకులను చంపిన కేసులో ముద్దాయి సి.పవిత్ర కు జీవిత కాలం ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా.*

*ఈ దినం అనగా 26-05-2026 వ తేదీన 09-09-2017వ సం. లో రామకుప్పం మండలంలోని కవ్వంపల్లి గ్రామంలో 6 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు వయస్సు గల ఇద్దరు కొడుకులను హత్య చేసిన ముద్దాయి సి.పవిత్ర కు జీవిత కాలం జైలు శిక్ష మరియు 1000 రూ.ల జరిమానా విధించిన చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జ్ శ్రీ ఎన్.శ్రీనివాస రావు గారు.*

*కేసు వివరాలు :*

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం, కవ్వంపల్లి గ్రామానికి చెందిన సి.వేమా రెడ్డి కి A1 ముద్దాయి అయిన సి.పవిత్ర తో వివాహం జరుగగా, వీరికి 6 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు వయస్సు గల ఇద్దరు కుమారులు కలరు.

ఈ క్రమంలో వేమా రెడ్డి ఇంటి నందు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న A2 ముద్దాయి అయిన వేమన్న తో సన్నిహితంగా మెలుగుతూ అతనితో అక్రం సంబంధం ఏర్పరుచుకుంది. ఈ సంబంధం కారణంగా A2 ముద్దాయి వేమన్నతో కలిసి తిరుమలకు వెళ్ళిపోగా, వాళ్ళ ఇంటి పెద్దలు వారిని పిలిపించి వారికి సర్ది చెప్పి పంపడంతో A2 ముద్దాయి వేమన్న బెంగుళూరుకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకునేవాడు.

అప్పుడప్పుడు కవ్వంపల్లి కి వచ్చే సమయంలో వారిరువురు కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో A1 ముద్దాయికి ఉన్న ఇద్దరు పిల్లలు వారి సంబందానికి అడ్డుగా ఉన్నారని బావించిన ఇద్దరు ముద్దాయిలు వారిని చంపేసి వీరిద్దరూ వేరే జీవితం మొదలుపెట్టాలని అనుకొని ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు.

09-09-2017 వ తేదీన ముద్దాయిలు ఇద్దరు కలిసి ఆమె పిల్లలు చదువుతున్న అంగన్వాడి పాటశాలకు వెళ్లి వారిని తీసుకోని A2 వారిని ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయాడు. A1 ముద్దాయి సి.పవిత్ర 6 సంవత్సరాల కొడుకుకు నైలాన్ తాడును ఒక పక్క బిగించి 3 సంవత్సరాల కొడుకుకు మరో పక్క బిగించి ఫ్యాన్ కి ఉరి వేసి అతి దారుణంగా చంపేసింది. అనంతరం వారి తాడును ఒక బ్లేడ్ తో కోయగా ఆమె పెద్ద కుమారుడు కింద పడడంతో వెనుక బాగంలో రక్త గాయం కూడా అయ్యింది. చనిపోయిన ఇద్దరు పిల్లలను మంచం మీద ఉంచి ఇంటి నందు ఉన్న 3000 రూపాయలను తీసుకోని A2 ముద్దాయితో ఇంటి నుండి పారిపోయింది.

అనంతరం ఇంటికి వచ్చిన ముద్దాయి భర్త చూడగా ఇంటి నందు ఒక రూమ్ లో విఘత జివిలై పడిఉండడంతో వెంటనే రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి రామకుప్పం ఎస్.ఐ శ్రీ సురేష్ బాబు గారు Cr.NO: 45/2017 U/Sec 174 CRPC కింద కేసు నమోదు చేయడం జరిగింది.

0
92 views

Comment