logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తహసిల్దార్..

జర్నలిస్టు మాకోటి మహేష్

*లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తహసిల్దార్
20 లక్షల రూపాయల లావాదేవీల కేసులో ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట్ ఎమ్మార్వో సుచరిత.._*
*_మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు, రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.._*
*_ఎమ్మార్వో సుచరితకు సంబంధించిన ఆమె డ్రైవర్ బాధితుడి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, వాటిని సుచరితకు అందిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.._* *_కార్యాలయంలో జరిగిన సుమారు 20 లక్షల రూపాయల భారీ లావాదేవీలకు సంబంధించిన కేసులో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.._*
*_ఈ భారీ మొత్తాన్ని దేనికోసం డిమాండ్ చేశారు, దీని వెనుక ఉన్న అసలు వివాదం ఏమిటనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు._*

0
56 views

Comment