వర్ధమాన నటుడు విరాజ్ అశ్విన్ తో తెలికాపు ఉమా భేటీ
2023 లో ఘన విజయం సాధించిన తెలుగు సినిమాలలో "బేబీ" ఒకటి... స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో పాటు విరాజ్ అశ్విన్ ఒక హీరోగా నటించి మెప్పించారు.పలు తెలుగు చిత్రాలలో ,షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు.ప్రస్తుతం ఒక చిత్రం లో నాగవంశం కులానికి చెందిన విజయవాడ నగర వాసి జరజాపు విరాజ్ అశ్విన్ ప్రస్తుతం నటిస్తున్న ఒక చిత్రం చిత్రీకరణ దశ లో ఉంది. విజయవాడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో టీడీపీ నేత నాగ వంశం మన్యం జిల్లా అధ్యక్షులు తెలికాపు ఉమామహేశ్వరరావు కలిసి క్షేమ సమాచారాలు,ఇంకా పలు విషయాలు చర్చించారు. విరాజ్ తండ్రి జరజాపు వెంకటేశ్వరరావు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో విశ్రాంత సైంటిస్ట్,తల్లి పేరు జరజాపు వెంకటేశ్వరీ.ఈయన దివంగత ఫిల్మ్ ఎడిటర్ కె. ఏ.మార్తాండ్ మనవడు,ఫిల్మ్ ఎడిటర్ మార్తాండ్. కె మేనల్లుడు అని సమాచారం.