logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకము

ఆదివాసీల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ దగ్గర కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని మరియు జెండా ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మగౌరవం,హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు.

ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని,గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,ఉపాధి,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.యువత కొమురం భీం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బట్టు కరుణాకర్ ,భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ , వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ , భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్ ,స్థానిక కౌన్సిలర్లు, ఆదివాసి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

33
2032 views

Comment