ఏఐ ఆధారిత ఫిర్యాదు కాపీరైట్ యాప్.
హైదరాబాద్:హైదరాబాద్ : దేశంలోనే తొలి ఎఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ‘ఎఐ కాప్‌రైటర్’ యాప్‌ను హైదరాబాద్ సిపి సజ్జనార్ శనివారం ఆవిష్కరించారు. దీని ద్వారా 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించవచ్చని చెప్పారు. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పిడిఎఫ్ రూపంలో సేవ్ అయ్యే సదుపాయం ఉందన్నారు. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. భాష న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఎఐను వినియోగిస్తున్నట్టు వివరించారు. తొలుత హైదరాబాద్ పరిధిలోని 80కి పైగా పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రక్రియను వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సహకారంతో యాప్ రూపకల్పన చేసినట్టు చెప్పారు.