భూసార పరీక్షలు రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి:
గోస్పాడు (శుభోదయం న్యూస్): గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామం లో జిల్లా వనరుల కేంద్రం వారు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వారు భూసార పరీక్షలు రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలని, భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేయాలని సూచించారు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని భూసార పరీక్షల కోసం సంప్రదించాలని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి మాట్లాడుతూ పచ్చి రొట్టె పైర్లు జీలుగలు మండలానికి 300 క్వింటాళ్లు కేటాయించారని 50% సబ్సిడీతో రైతు 800 రూపాయలు10 కేజీల ప్యాకెట్ కు చెల్లించాల్సి వస్తుందని అవసరమున్న రైతులు సంబంధిత రైతు సేవ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. మరియు వ్యక్తిగత పరికరాలు కోసం రైతులు ఈనెల 26 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని డైరెక్ట్ గా రైతే ఆన్లైన్ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా సంబంధిత రైతు సేవ కేంద్రం కెళ్ళి నమోదు చేసుకోవాలని చెప్పారు. రైతు శిక్షణా కేంద్రం అధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఎల్లినో ప్రభావం దృష్టిలో పెట్టుకొని రైతులు వాటికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ADA రైతు శిక్షణా కేంద్రం చెన్నయ్య మాట్లాడుతూ అవసరం మేరకే ఎరువులు వాడాలని భూసారాన్ని కాపాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.