logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భూపాలపల్లి పట్టణ ప్రజలకు ముఖ్య సూచనలు

🌞 భూపాలపల్లి పట్టణ ప్రజలకు ముఖ్య సూచనలు🌞

ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి.

☀️ ఎండ నుండి రక్షణ కోసం పాటించాల్సిన సూచనలు:
• ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వాడాలి.
• వదులైన తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.
• నెత్తిపై టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి.
• తరచుగా ఎక్కువ నీరు తాగాలి.
• ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ నీరు లేదా ORS ద్రావణం సేవించాలి.
• మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో అవసరం లేకుండా బయట తిరగకుండా ఉండాలి.

🚨 *వడదెబ్బ లక్షణాలు:*
• తీవ్రమైన తలనొప్పి
• తల తిరగడం
• అధిక జ్వరం
• మత్తు, కలవరింతలు
• ఫిట్స్ రావడం
• అపస్మారక స్థితి రావడం

🩺 *వడదెబ్బ తగిలితే చేయాల్సిన ప్రథమ చికిత్స:*

• బాధితుడిని వెంటనే చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలి.
• చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి.
• శరీర ఉష్ణోగ్రత తగ్గేవరకు ఫ్యాన్ క్రింద ఉంచాలి.
• పరిస్థితి మెరుగుపడకపోతే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి*
🙏 *ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం* .

ఇట్లు
బుర్ర కొమురయ్య
చైర్మన్- భూపాలపల్లి మున్సిపాలిటీ

33
3675 views

Comment