logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

​సహారా కార్యాలయం ముందు బాధితుల నల్ల బ్యాడ్జీల ధర్నా: మా డబ్బులు మాకు చెల్లించాలి

మంచిర్యాల (నస్పూర్), మార్చి 12: తమ కష్టార్జితాన్ని వెనక్కు ఇవ్వాలంటూ సహారా ఇండియా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ సీసీసీ ఎక్స్ రోడ్ వద్ద గల సహారా ఇండియా కార్యాలయం ముందు బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.
​ఏళ్లు గడుస్తున్నా అందని మెచ్యూరిటీ సొమ్ము
​ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, సంస్థ ఏజెంట్ల మాటలు నమ్మి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, కూలీలు మరియు చిరు వ్యాపారులు కోట్లాది రూపాయలను ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారని తెలిపారు.
​పాలసీలు మెచ్యూరిటీ పూర్తయి ఏండ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
​కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే నెలలు, ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
​ఆన్‌లైన్ నమోదు పేరుతో, బాండ్లలో తప్పులు ఉన్నాయని, నోటరీ తేవాలని సాకులు చెబుతూ వేధిస్తున్నారని బాధితులు వాపోయారు.
​కఠిన నిర్ణయానికి సిద్ధం
​వచ్చే 10 నుండి 15 రోజుల్లోగా తమ డిపాజిట్ సొమ్మును వడ్డీతో సహా చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాల బాధితులందరినీ ఏకం చేసి, సహారా కార్యాలయాల ముందు శాంతియుత మార్గంలో రిలే నిరాహార దీక్షలు లేదా ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు.
​ప్రభుత్వానికి విజ్ఞప్తి
​స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సహారా యాజమాన్యంతో మాట్లాడాలని వారు కోరారు. ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభ అనుభవిస్తున్న తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
​పాల్గొన్న వారు:
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకులు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు జి. వెంకట్ రెడ్డి, పెద్దపల్లి మల్లయ్య, మోతే కాంతయ్య, డి. రాజమౌళి, అంకం సతీష్, రెడవని శంకర్, కె. మల్లయ్య, పిరిపిరెడ్డి అరుణ, నక్షత్ర, మహేష్ మరియు పెద్ద సంఖ్యలో మహిళా బాధితులు పాల్గొన్నారు.
​రిపోర్టర్: శ్రీనివాస్, మంచిర్యాల

13
559 views

Comment