ఆర్.జి.ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జాతీయ సాంకేతిక సదస్సు.
పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలం ఆర్.జి.ఎం ఇంజనీరింగ్ కళాశాల ఈ ఈ ఈ విభాగం ఆధ్వర్యంలో మార్చి 12వతేది గురువారం 22 వ జాతి జాతీయ సాంకేతిక సదస్సు ప్రవాహ 26 ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 22వ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఈ సాంకేతిక సదస్సు విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు మరియు పరిశోధనా ఆలోచనలను ప్రోత్సహించే వేదికగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, టెక్నికల్ క్విజ్, కోడింగ్ బ్యాటిల్, సర్క్యూట్ ట్విస్టింగ్, EV స్పార్క్ మరియు మోడల్ ప్రెజెంటేషన్ (Pragma) వంటి విభిన్న సాంకేతిక పోటీలు నిర్వహించబడ్డాయి. దేశంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు.పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ ఎనర్జీ , ఐ ఓ టి కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనెటిక్ ఆల్గోరిథమ్స్ తదితర ఆధునిక సాంకేతిక అంశాలపై పేపర్లు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.కళాశాల చైర్మన్ డా. ఎం. శాంతిరాముడు ప్రధాన పరిరక్షకులుగా, ప్రిన్సిపాల్ డా. టి. జయచంద్ర ప్రసాద్ ప్రధాన సమన్వయకర్తగా, డైరెక్టర్ డాక్టర్ డి.వి. అశోక్ కుమార్ సహ సమన్వయకర్తగా, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వి. నాగ భాస్కర్ రెడ్డి కన్వీనర్‌గా, డా. డి. లెనిన్, శ్రీ వై. విజయా సురేష్ సహ కన్వీనర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమమునకు శ్రీ. వై అశోక్ రెడ్డి, జేటివో, బిఎస్ఎన్ఎల్ కర్నూలు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ టెలికాం సెక్టర్ లో ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ గురించి సోదాహరణంగా వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం రిపుల్ 2కే 26 సావనీర్ లను ఆవిష్కరించారు.