విజయనగరంలో జనశక్తి పార్టీకి విశేష స్పందన: బుధవారం పెందుర్తిలో మరో సభ
సోమవారం రోజున అనగా 08 తేదీన నిర్వహించిన నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్టేట్ మరియు సెంట్రల్ ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ సభ్యులు మరియు ముఖ్య అతిధులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం జరిగింది. విశాఖపట్నం ఇంచార్జ్ ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ రాబోతున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సభను నిర్వహించామని తెలియజేశారు. వచ్చే బుధవారం అనగా 10.12.2025 తేదీని విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలోని కూడా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని సభాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం వచ్చిన తన మిత్రులకు సన్మాన కార్యక్రమాలను కూడా చేశారు.