logo

ట్రాన్స్ ఫార్మర్ వైర్ ల చోరీ

జరజాపు పేటలో ట్రాన్స్ఫార్మర్ వైర్ చోరీ


విజయనగరం జిల్లా,నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో నున్న జరజాపుపేట గ్రామం లోని జగనన్న లే అవుట్లో ఇటీవల ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ 16కేవీ ట్రాన్స్ఫార్మర్ల లోని కాపర్ వైర్ ను ఆగంతకులు చోరీ చేశారు, మిగతా ఐరెన్ సామగ్రి, బాక్సులు అక్కడే వదిలి వేశారు.ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి, జరజాపుపేట గ్రామపెద్ద, నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావుకు తెలియజేసిన వెంటనే స్పందించిన వైస్ చైర్మన్ రామారావు నెల్లిమర్ల పోలీసులకు
పిర్యాదు చేయగా పోలీస్ వారు
కేసు నమోదు చేసి( క్రైమ్ నెంబర్ 173) దర్యాప్తు ప్రారంభించారు. యస్.ఐ. బి. గణేష్,వారి సిబ్బందితో ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని, చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దొంగలు ట్రాన్స్ఫార్మర్ విప్పి అందులో ఉన్న విలువైన కాపర్ వైర్ ను చోరీ చేసినట్లు గుర్తించారు. గ్రామ పెద్దలు, కాలనీ లబ్ధిదారులు, లైన్ మెన్ నుండి స్టేట్మెంట్ తీసుకొన్నారు.స్థల పరిశీలనలో ఎ.యస్.ఐ. రమణమూర్తి ,పోలీసులతో పాటు
నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు, నాగవంశం మాజీ డైరెక్టర్ మద్దిల వాసు,18,19 వార్డుల కౌన్సిలర్ ప్రతినిధులు తుమ్ము నారాయణమూర్తి, నల్లి శివ ప్రసాద్, గ్రామ మాజీ మెంబర్ మద్దిల వెంకటరమణ, బి.సి.కాలనీ పెద్దలు కనకల హైమావతి, జగనన్న కాలనీ లబ్ధిదారులు, జూనియర్ లైన్ మెన్ విద్యాసాగర్ పాల్గొన్నారు.

1
110 views