logo

రైతులకు హామీలు, వినతుల పరిష్కారానికి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోండి. ప్రత్యేక అధికారి నాగలక్ష్మి

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో రైతు వినతుల పరిష్కారానికి మండల ప్రత్యేకాధికారి నాగలక్ష్మి నాయకత్వంలో MRO కార్యాలయంలో సమావేశం జరిగింది.రైతులు సమర్పించిన వివిధ వినతులను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలన్నదే ఈ సమావేశం లక్ష్యం అని తెలిపారు. రైతుల సమస్యలపై సమగ్ర సమీక్ష చేసి, పెండింగులో ఉన్న వినతుల పరిశీలనను వేగవంతం చేయాలని MRO నాగమ్మకు సూచించారు.కార్యాలయ సిబ్బంది ప్రతి వినతిని సీరియస్‌గా తీసుకుని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు హామీలు వినతుల పరిష్కారంలో ఆలస్యం కాకుండా సమయానుకూలంగా సేవలు అందించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ముఖ్యంగా భూ సమస్యలు, పంట నష్టాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి, అవసరమైన సలహాలు, పరిపాలనా సహాయం అందిస్తామని తెలిపారు.సమావేశంలో MROతో పాటు MPDO నాగేశ్వరరావు తదితరఅధికారులుపాల్గొన్నారు.అందరూ కలసి రైతుల అభ్యర్థనలను విని,పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

0
1054 views