logo

డ్రగ్స్ తో నిండు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు:మంత్రి గుమ్మిడి సంధ్యారాణి




డ్రగ్స్ వద్దు బ్రో - వద్దే వద్దు బ్రో
డ్రగ్స్ వద్దు- చదువే ముద్దు
డ్రగ్స్ తో జీవితం నాశనం
డ్రగ్స్ మానేద్దాం-
అమ్మ నాన్న చెప్పిందే విందాం.అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.తదుపరి
అభ్యుదయం సైకిల్ యాత్రను ప్రారంభించారు.
ర్యాలీ సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రారంభమై డీలక్స్ సెంటర్ వరకు కొనసాగింది.
మంత్రి స్వయంగా సైకిల్ తొక్కుతూ యువతను ఉత్తేజపరిచారు.
“అమ్మకి చెప్పి ఏపనైనా చేయండి ” అంటూ అమ్మ ప్రేమ గురించి హృదయపూర్వకంగా వివరించారు.
ప్రజల్లో ఆరోగ్య చైతన్యం, పర్యావరణ, రవాణా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టి, కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు
యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపుపై దృష్టి సారించాలన్నారు.

112
3682 views