logo

హెచ్ఐవితో అధైర్యపడవద్దు: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని మందులతో జీవితకాలం పెంపొందించుకోవడంతో పాటు, ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే - 2025 సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నుండి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వరకు నిర్వహించే ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు సమాన హక్కులు కలిగినవారే.... సరైన మందులు, సమయానికి చికిత్సతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు” అని తెలిపారు. బాధితుల పట్ల ఏ విధమైన వివక్ష, అపోహలు సమాజంలో ఉండకూడదని, హెచ్ఐవి ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రక్తాన్ని స్వీకరించే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవడం, సురక్షిత జీవన విధానాలు పాటించడం ప్రతి కుటుంబం అనుసరించాల్సిన బాధ్యత అని కలెక్టర్ సూచించారు. తరువాత హెచ్.ఐ.వి బాధితులతో అల్పాహార విందులో పాల్గొన్న కలెక్టర్, “సమయానికి పరీక్ష - సమయానికి చికిత్స - సురక్షిత జీవనశైలి ఎయిడ్స్ నివారణకు ప్రధాన ఆయుధాలు” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ, డీసిహెచ్ఎస్ లలిత, వైద్య సిబ్బంది, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

0
77 views