
పేద విద్యార్థుల చదువు కోసం శ్రమిస్తున్నాం..
బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చాంద్ పాషా
విశాఖపట్నం (పెద్ద గంట్యాడ మండలం )
తల్లిదండ్రులు లేని పిల్లలతో పాటు పేదరికంలో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో రెండింటిలో 52 పాఠశాలలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు2002 లో ప్రారంభించి నేటికి 23 సం||పూర్తి అయిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు సందర్శించి అడాప్ట్ ఏ చైల్డ్ అనే కార్యక్రమం ద్వారా 2021నుంచి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి అవసరమైన వస్తువులను,సేవలను అందిస్తూ ఉన్నారు.
పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి తరగతి నుండి పదిమంది చొప్పున 50మంది విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవార్డులను అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు తరువాత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్నారు.
పాఠశాలకు,విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలను భవిష్యత్తులో కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు.
బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చాంద్ పాషా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు మంచి విలువలతో కూడిన విద్యాభ్యాసం విద్యార్థులకు ముఖ్యమని.మా యొక్క సంస్థ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు,స్పోర్ట్స్ కు సంబంధించిన సామాగ్రి అలాగే విద్యార్థులకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పిస్తున్నాము. స్కూల్ ఆవరణ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాట్లు. ఎక్కడ చదువుకోవడం విద్యార్థులు ఎంతో శుభ పరిణామం.ఈరోజు బాలలే రేపు తరాలకు బాటగా నిలిచే వ్యక్తులుగా మారుతారు.మా యొక్క సంస్థ ద్వారా ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకునే విధంగా చర్యలు చేపడుతున్న. మా ట్రస్ట్ ఈ ద్వారా 52 స్కూళ్లను దత్తత తీసుకోవడం అందులో భాగంగా నటుపూరు ఉన్నత పాఠశాల ఒకటి.ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఇతర టీచర్లు బోధనా విషయంలో అర్థమయ్యే విధంగా పిల్లలకు విద్యను నేర్పించడం ఇది ఒక శుభ పరిణామం.జిల్లాలో గుర్తింపు పొందిన నడు పూర్ హైస్కూల్ ఒకటి.విద్యార్థులు చదువులో, స్పోర్ట్స్ ఇతర ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ లోనూ ఎన్నో అవార్డులు గెలుచుకున్న స్కూల్.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ రాచకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మా యొక్క స్కూల్ విద్యార్థులకు అన్ని విధాలా సహకరించిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చాంద్ పాషా ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు వారి భవిష్యత్తుల గురించి ఆలోచించే ఇలా స్వచ్ఛంద సంస్థలు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ ఒకటి. ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు భావితరాల అడుగులకు బాటగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 75 వ వార్డు కౌన్సిలర్ పులి లక్ష్మీబాయి,పెద్ద గంట్యాడ మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు మరియు రమణాజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసు,రాజ్ కుమార్,ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ బాబ్జీ,అవార్డు డైరెక్టర్ ఎన్.కళ్యాణి, బి శ్రీనివాసరావు,ఎమ్ ఇందిర,శివ,రవి మిగిలిన ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.