logo

11-11-2025 స్థలం: హిందూపురం అసెంబ్లీ ఆంధ్ర ప్రదేశ్ రెండవ అధికార భాషగా ఉన్న


11-11-2025
స్థలం: హిందూపురం అసెంబ్లీ
ఆంధ్ర ప్రదేశ్ రెండవ అధికార భాషగా ఉన్న ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) హిందూపురం అసెంబ్లీ నాయకులు మరియు జిల్లా నాయకులు MRO గారికి వినతిపత్రం అందజేశారు.

తెలుగు మరియు ఆంగ్ల భాషలతో పాటు ఉర్దూ భాషను కూడా ప్రభుత్వ లోగోలు, బోర్డులు, పేరు ఫలకాలు మరియు పత్రవ్యవహారాల్లో తప్పనిసరిగా వినియోగించాల‌ని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా SDPI జిల్లా అధ్యక్షుడు కారి అమ్‌జాద్ అలీ మాట్లాడుతూ, “ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించినప్పటికీ, చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అది అమలులో లేకపోవడం విచారకరం. ఇది రాజ్యాంగం కల్పించిన భాషా సమానత్వ సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలోని లక్షలాది ఉర్దూ భాషాభిమానుల భావాలను గౌరవిస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కారి అమ్‌జాద్ అలీ, అసెంబ్లీ ప్రెసిడెంట్ షేక్ ఇమ్రాన్, జిల్లా జనరల్ సెక్రటరీ సి.దాదా పీర్ పాల్గొన్నారు.

– SDPI హిందూపురం అసెంబ్లీ, శ్రీ సత్యసాయి జిల్లా. ఆంధ్రప్రదేశ్

13
864 views